40 ఏండ్లుగా ప్రజాసేవకే అంకితం

– గెలిచినా, ఓడినా ప్రజలతోనే
– జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారం 

నవతెలంగాణ మద్నూర్ 
1978 నుండి ప్రజాసేవకే అంకితం గా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జుక్కల్ అసెంబ్లీ శాసనసభ్యునిగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ప్రజాసేవలు చేస్తూ ఓడిన గెలిచిన 45 సంవత్సరాల కాలంగా జుక్కల్ ప్రజల సేవకే అంకితం అవుతున్నానని జుక్కల్ నియోజకవర్గం లని ప్రజలు ఎక్కడ ఎలాంటి శుభ కార్యక్రమాలకు పిలిచినా తప్పకుండా వెళ్లి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే గంగారం తెలిపారు మద్నూర్ మండలం లోని రచూర్ గ్రామంలో కుషాల్ పటేల్
ఇద్దరు పిల్లల నూతన వస్త్రధారణ కార్యక్రమంలో జుక్కల్ మాజీ శాసన సభ్యులు సౌదగర్ గంగారాం హాజరై చిన్నారులకు ఆశీర్వాదించారు మా పిలుపును మన్నించి వచ్చినందుకు కుషాల్ కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యేకు శాలువాతో ఘనంగా సత్కరించారు గంగారాం వెంట కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సౌదగర్ అరవింద్,కొడ్చిర్ సంజు, ఉప సర్పంచ్ విరబద్రప్ప, డా: కేశవ్, తదితరులు పాల్గొన్నారు