ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ ఆసుపత్రి నందు అవగాహన సదస్సు

నవతెలంగాణ కంఠేశ్వర్
ప్రపంచ అనుమానా దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ఖలిలవాడి నందుగల ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ ఆసుపత్రి నందు అవగాహన సదస్సును మరియు అనుమానానికి సంబంధించిన అవగాహన చికిత్స మార్గాల కరపత్రాల ఆవిష్కరణ ను రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు క్లబ్ అధ్యక్షులు సతీశ్ షాహ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేటి రోజులలో అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ప్రజలందరూ వీటిని ఉపయోగించుకోవాలని కోరడం జరిగినది. అనంతరం క్లబ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విశాల్ ఆకుల మాట్లాడుతూ నేటి అత్యాధునిక యుగంలో ప్రతి ప్రతి చికిత్స కు వైద్యం అందుబాటులో ఉన్నదని మన పురాతన రోజులలో చాలామంది కూడా అక్కడక్కడ గ్రామాలలో నాటు వైద్యాలను ఇంకా సంప్రదిస్తున్నారని అత్యాధునిక వైద్యాలతో ప్రతి కఠిన చికిత్సకు వైద్యం అందుబాటులో ఉన్నదని వీటిని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు అనుమానం అనునది కౌమర దశ నుండి మగ ఆడ అనీ తేడా లేకుండా మన రోజువారి జీవనశైలిలో మార్పుల వలన సంభవిస్తూ ఉంటుందని దీనికై దిగులు చెందకుండా త్వరితగతిన నైపుణ్యవంతులైన వైద్యులను సంప్రదిస్తే తక్షణ చికిత్స తో జీవితాన్ని ఆనందంగా మలుచుకోవచ్చని అన్నారు. మన మెదడు కు   ఒత్తిడి వలన కూడా అనేక రకాలైన న్యూరాన్లు దెబ్బ తినడం వలన ఇలాంటివి సంభవిస్తాయని తగిన చికిత్స తీసుకొని పౌష్టిక మైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూమళ్లీ తిరిగి యధా జీవనానికి మన ముందుకు సాగవచ్చు అని అన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ నిజామాబాద్ సభ్యులు రాజ్ కుమార్ సుబేదార్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది.