– బాధ్యతల అప్పగింతపై చర్చలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. గురువారం కాంగ్రెస్‌లో చేరిన షర్మిల, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను శుక్రవారం కలిశారు. ఈ సమావేశంలో ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ తనకు బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చలు జరుగుతు న్నాయనీ, ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అన్నారు. తనకు ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ను కూడా షర్మిల కలిశారు.