రేషన్ డీలర్ల సంక్షేమ సంఘము జిల్లా కార్యనిర్వహక అధ్యక్షుడిగా సురేష్

నవతెలంగాణ మల్హర్ రావు: రేషన్ డీలర్ల సంక్షేమ సంఘము భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన బూడిద సురేష్ ను నియమించినట్టు జిల్లా అధ్యక్షుడు గడ్డం రాధాకృష్ణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డివిజన్ అధ్యక్షుడుగా రేగొండ మండలానికి చెందిన కునూరు జయప్రకాష్ ను నియమించినట్టుగా తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు, ఆయా మండలాల అధ్యక్ష, కార్యదర్శులకు సురేష్, జయప్రకాష్ లు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. డీలర్ల సంక్షేమం, హక్కులు, సమస్యలపై తమవంతుగా పోరాటం చేస్తామన్నారు.