నిరుపేదలకు అండగా బుసిరెడ్డి ఫౌండేషన్ 

– అన్ని విధాలా ఆదుకుంటా …
– మానవ సేవే మాధవ సేవ అని చాటిచెప్పే గుణం
నవతెలంగాణ -పెద్దవూర: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం, గుర్రంపోడు మండలం,జూనూతల గ్రామానికి చెందిన వాకిటి లక్ష్మయ్య ముదిరాజ్ ( 75 ), అలాగే త్రిపురారం మండలం అంజనపల్లి గ్రామానికి చెందిన మడుపు బిక్షం (53)శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకొని బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి కుటుంభ సభ్యులను ఓదార్చి వారికీ మనోధైర్యాన్ని ఇచ్చి మీకు అండగా నేనున్నానంటూ అంత్యక్రియలు అనంతరం అక్కడికి వచ్చిన బంధువులకు, మిత్రులకు భోజనాలు పంపించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి బుసిరెడ్డి ఫౌండేషన్ ఎల్లపుడు అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉంటుందని, సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356 ను సంప్రదించవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.