వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని భూపాలపల్లి జిల్లా వైద్యాధికారి మధుసూదన్ ఆదేశించారు.శనివారం మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల ఎంపిపి, పిహెచ్ సి చైర్మన్ చింతలపల్లి మలహల్ రావు తో కలిసి తనిఖీ నిర్వహించారు.రోజువారీ సిబ్బంది హాజరు రిజిస్టర్డ్,మెడిసిన్ రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మాణం చేస్తున్న తాడిచెర్లలోని వైద్యాధికారి భవన నిర్మాణం, తాడిచెర్ల, మల్లారం,ఎఫ్లపల్లి,వళ్లెంకుంట గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత, వేగంగా పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో విద్యాధికారికి రాజు,సిబ్బంది పాల్గొన్నారు.