ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని నియమించాలి..

– టీయూఎఫ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి
నవతెలంగాణ మల్హర్ రావు
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టియూఎఫ్) రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రమైన తాడిచెర్లలో నిర్వహించిన ఉద్యమకారుల సదస్సుకు జ్యోతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. అమరుల బలిదానాలతో, ఉద్యమకారుల పోరాటం ద్వారా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను తీవ్రంగా విస్మరించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ నేడు ఉద్యమకారులను గుర్తించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు, ప్రభుత్వానికి ఉద్యమకారుల ఫోరం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ మానిఫేస్టోలో పొందుపరిచిన 250 గజాల ఇంటి స్థలంతో పాటు ఉద్యమకారుల సంక్షేమ బోర్డు, పెన్షన్, ఉచిత బస్, ట్రైన్ హెల్త్ గుర్తింపు కార్డులు, ఇచ్చి జార్ఖండ్ తరహాలో ఉద్యమకారులను గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యాదండ్ల గట్టయ్య,, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలోజు సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షు బోయిని రాజయ్య యాదవ్,  సీనియర్ ఉద్యమ కారులు ముస్కే ఈశ్వరమ్మ, గడ్డం సమ్మక్క, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముడితనపెల్లి ప్రభాకర్, ఉద్యమ కారులు చొప్పరి రాజు, అక్కపాక సమ్మయ్య, బూడిద సతీష్, మీనుగు నాగేష్, తోకల గణేష్, షేక్ చాంద్ పాష, బండారి యశోద, రౌతు భీమయ్య, ముద్రవేణి కిష్టయ్య, బడితెల వెంకటస్వామి, సభాపత్ నాగరాజు, ఆకుల సది, మాచర్ల ఓదెలు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.