ఆన్ లైన్ నమోదులో తప్పులు జరిగితే అధికారులదే బాధ్యత: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

– అందుబాటులో సరిపడా ఫర్టిలైజర్
– ఫర్టిలైజర్ పాత బకాయిలకు చైర్మన్, కార్యదర్శిలదే బాధ్యత
నవతెలంగాణ- నవీపేట్: ప్రజా పాలన దరఖాస్తుల ఆన్లైన్ నమోదులో తప్పులు జరిగితే అధికారులే బాధ్యత వహించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆన్లైన్ నమోదు ప్రక్రియను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం చేయవద్దని ఏవైనా తప్పులు జరిగితే అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. జిల్లాలో 75 వేల మెట్రిక్ టన్నుల ఫర్టిలైజర్ అవసరం ఉండగా ప్రస్తుతం 50 వేల మెట్రిక్ టన్నుల ఫర్టిలైజర్ సొసైటీలలో అందుబాటులో ఉందని అన్నారు. ఎవరైనా పెద్ద రైతులకు లారీ ఫర్టిలైజర్ అవసరమైతే ఎటువంటి కిరాయి లేకుండా లారీని కోరిన చోటికి పంపించడం జరుగుతుందని అన్నారు. గతంలోని ఫర్టిలైజర్ పాత బకాయిలను వసూలు చేయాలని అన్నారు. సొసైటీలలో ఫర్టిలైజర్ పాత బకాయిలకు సొసైటీ చైర్మన్, కార్యదర్షులే బాధ్యత వహించాలని తెలిపారు. అనంతరం అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సంబంధిత శాఖ రిపోర్టులను వెంటవెంటనే తనకు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో రాజా గౌడ్, ఎమ్మార్వో దన్వాల్వ్, ఎంపీడీవో సాజిద్ అలీ, ఎంపీఓ రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.