సమస్యల పరిష్కారానికే ‘శుభోదయం’

– ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-షాబాద్‌
గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలిసుకుని వాటిని పరిష్కారానికే ‘శుభోదయం కార్యక్రమం’ చేపట్టినట్టు ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం షాబాద్‌ మండల పరిధిలోని కక్కులూర్‌ గ్రామంలో పర్యటించి, గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిశీలించి, స్థానికుల సమ స్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కక్కులూరు గ్రామంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాటపన కార్యాక్రమంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న విద్యుత్‌ సమస్యలు త్వరితగతిన పనులు చేపట్టి, ఆ సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్హులకు పింఛన్లు రాకపోతే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మెన్‌ చల్లా శేఖర్‌రెడ్డి, సర్పంచ్‌ భానూరి మమతజీవన్‌రెడ్డి, ఎంపీ టీసీ మంగలి కరుణా కర్‌, నాయకులు నక్క శ్రీనివాస్‌ గౌడ్‌, మధు సూదన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ఎంపీడీవో అనురాధ, ఏఈలు శ్రీదివ్య, నరేందర్‌, శారధ, గ్రామస్తులు పాల్గొన్నారు.