
– మునిగిలవీడు గ్రామ సర్పంచ్ నల్లని నవీన్ రావు
నవతెలంగాణ-నెల్లికుదురు : మునిగలవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకత తరగతులు నిర్వహిస్తున్న సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు సాయంకాల అల్పాహారము అందించడానికి దాతలు గా స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ కనుకుల క్రాంతి కిరణ్ మరియు మరింగంటి తిరుమలచార్యులు ముందుకు వచ్చి వారు విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నందుకు మా గ్రామస్తులు తరఫున కృతజ్ఞతలు అని ఆ గ్రామ సర్పంచ్ నల్లని నవీన్ రావు సోమవారం అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిరణ్ మరియు మరింగంటి తిరుమలాచార్యులు ముందుకు వచ్చి వారి స్వంత ఖర్చులతో విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు నుండి 2 నెలల పాటు సాయంకాల అల్పాహారం అందిస్తామని తెలపడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు హర్ష వ్యక్తం ప్రకటించామని అన్నారు విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం వారి సొంత ఖర్చులను హెచ్చించి ఈ గ్రామానికి అందించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై కే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పాఠాలు బోధించిన గురువులకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు అంతేకాకుండా కన్న తల్లిదండ్రులకు మీ విద్యా అభివృద్ధికి కృషి చేస్తున్న అతిధులను గుర్తించే విధంగా మీరు ప్రతి సబ్జెక్టులో 10/10 జీబి సాధించాలని అన్నారు విద్యార్థులు కష్టపడి ఇష్టంతో చదివి ఉన్నంత శిఖరాలకు అధిరోహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకుడు నల్లని పాపారావు యూత్ జిల్లా నాయకుడు నల్లాని ప్రవీణ్ రావు వినోద్ సీతారాములు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వప్న ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.