అందుకే ఎర్ర సముద్రం అంటారు..

అందుకే ఎర్ర సముద్రం అంటారు..ఎన్టీఆర్‌ లేటెస్ట్‌ భారీ చిత్రం ‘దేవర’. బాలీవుడ్‌ నాయిక జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో బాలీవుడ్‌ నటుడు సైప్‌ అలీ ఖాన్‌ కీలక పాత్రలో అలరించబోతున్నారు. డైరెక్టర్‌ కొరటాల శివ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో తొలి భాగం ‘దేవర పార్ట్‌ 1’ ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్‌ 5న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌ రిలీజ్‌ అవుతోంది. మేకర్స్‌ సోమవారం ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌తో ఈ సినిమా రూపొందుతోందని గ్లింప్స్‌ చూస్తే తెలుస్తోంది. సముద్రం, ఓడలతో పాటు రక్తంతో నిండిన ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఇంతకు ముందెన్నడూ చూడని మాస్‌ అవతార్‌లో ‘దేవర’గా ఎన్టీఆర్‌ నటన, లుక్‌ అదుర్స్‌ అనేలా ఉన్నాయి. గ్లింప్స్‌లోని ప్రతీ ఫ్రేమ్‌ చూస్తుంటే కొరటాల శివ సృష్టించిన సరికొత్త భారీ ప్రపంచం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రక్తంతో తడిసిన ఆయుధాన్ని ఎన్టీఆర్‌ శుభ్రం చేస్తూ, ‘ఈ సముద్రం చేపల కంటే రక్తాన్నే ఎక్కువగా చూసింది అందుకనే దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ తన పవర్‌ఫుల్‌ వాయిస్‌తో హైలెట్‌గా నిలిచింది. అనిరుద్‌ రవిచందర్‌ సంగీతం సినిమాను నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళుతుంది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ బ్యానర్స్‌ అంచనాలను మించేలా ఎక్కడా తగ్గకుండా అన్‌కాంప్రమైజ్డ్‌గా సినిమాను రూపొందిస్తున్నాయి. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్‌, హరికష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.