
– విజేతలకు బహుమతులు అందజేత…
నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండల కేంద్రంలోని రెంజల్, కళ్యాపూర్ గ్రామాలలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు ట్రస్ట్ చైర్పర్సన్ అయేషా ఫాతిమా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ఎమ్మెస్ రమేష్ కుమార్, కళ్యాపూర్ సర్పంచ్ కాశం నిరంజన్ సాయిలు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శేషు గారి భూమా రెడ్డి, సొసైటీ డైరెక్టర్ అగ్గు నారాయణ, అనిల్, సాయ గౌడ్, పాలకవర్గ సభ్యుడు కుమార్, గ్రామ కార్యదర్శి రాజేందర్ రవు తదితరులు పాల్గొన్నారు.