కొయ్యలగూడెంలో దివీస్ ఉచిత వైద్య శిబిరం..

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలో జిల్లా మండల పరిషత్ పాఠశాలల బాల బాలికలకు దివీస్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపిటిసి సభ్యురాలు జెల్లా ఈశ్వరమ్మ వెంకటేశం మాట్లాడుతూ దివీస్ యజమాన్యం ఆర్థికంగా సహాయ సహకరాలు మండల వ్యాప్తంగా ఎంతో పేద పిల్లలకు ఉపయోగపడుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ కైరంకొండ అశోక్ డాక్టర్లు జయంత్ కుమార్, సౌజన్య దివీస్ సిఎస్ఆర్ ఇంచార్జ్ వల్లూరి వెంకటరాజు, సాయికృష్ణ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.