మంత్రి ఉత్తమ్ ను కలిసిన ఓరుగంటి…

నవతెలంగాణ – బెజ్జంకి 
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంగళవారం రాష్ట్ర ఆహార భద్రత మండలి సభ్యుడు ఓరుగంటి ఆనంద్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి ఓరుగంటి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రితో భేటి అయి ఆహార భద్రత మండలి విధివిధానాలపై చర్చించినట్టు ఓరుగంటి ఆనంద్ తెలిపారు.