హైదరాబాద్ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ ఎల్జీ హైదరాబాద్‌లో ఐదు స్టోర్లకు విస్తరించినట్టు ప్రకటించింది. తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను ఎల్జి ఎలక్ట్రానిక్స్ రీజనల్ బిజినెస్ హెడ్ శశి కిరణ్ రావు, బ్రాంచ్ మేనేజర్ జీవన్ నేతృత్వంలో ప్రారంభించారు. తమ ఉత్పత్తులన్నీ ఒక్క చోట లభిస్తాయని ఆ సంస్థ పేర్కొంది.