హైబిజ్‌ టీవీ రియాల్టీ అవార్డులకు నామినేషన్లు

హైబిజ్‌ టీవీ రియాల్టీ అవార్డులకు నామినేషన్లుహైదరాబాద్‌ : హైబిజ్‌ టీవీ కొత్తగా రియాల్టీ అవార్డ్స్‌ 2024ను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రాణిస్తున్న సంస్థలకు, ప్రముఖులకు 50 కి పైగా అవార్డులను ఇవ్వనున్నట్టు హైబిజ్‌ టీవీ ఫౌండర్‌, ఎండీ ఎం రాజగోపాల్‌ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో పలువురు ప్రముఖులతో కలిసి ఆయన అవార్డుల నామినేషన్ల పోస్టర్‌ను ఆవిష్కరించారు. నామినేషన్ల స్వీకరణ చివరి తేదిని జనవరి 18గా నిర్ణయించామన్నారు. రియాల్టీ రంగంలో దశాబ్దాలుగా ఉత్తవ సేవలను అందిస్తున్న ప్రముఖులను సత్కరించే యోచనతో దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.