నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: ఎన్నికల మేనిఫెస్టో హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మంగ నరసింహులు డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో మంగళవారం రైతు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయ రంగం నీటిపారుదల రంగానికి సంబంధించిన అంశాలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా ఉన్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ 3 లక్షల రుణము కౌలు రైతులతో సహా ఎకరాకు 15 వేల రూపాయలు రైతు భరోసాగా ఇస్తామని అన్నారని అన్నారు. భూమి లేని వారికి 12,000 వేల రూపాయలు సంవత్సరానికి రాయితీగా ప్రకటించారు అని అన్నారు. పంటల భీమా పథకంతో పాటు నకిలీ విత్తనాలు క్రిమిసంహారక మందుల వ్యాపారం చేసే వారిపై పీడీ యాక్ట్ తో పాటు ఆస్తులు జప్తు చేస్తామని ప్రకటించారని అన్నారు.కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన మద్దతు ధరలకు తోడుగా బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చారని అన్నారు.అసైన్డ్ భూముల పునరుద్ధరణ భూసేకరణలో పట్టా భూములతో పాటు అసైన్డ్ భూములకు కూడా సమాన ధర చెల్లిస్తామని మేనిఫెస్టోలో వాగ్దానం చేశారని అన్నారు.పాలకు లీటరుకు 5 రూపాయలు ప్రోత్సాహకము వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు.కోతులు అడవి పందులు నివారణకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. రైతు బీమా 59 సంవత్సరాల నుండి 75 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మంగ నరసింహులు, బూరుగు కృష్ణారెడ్డి, చీరిక అలివేలు, నూకల భాస్కర్ రెడ్డి, బబ్బురి పోశెట్టి, దొడ యాదిరెడ్డి, చిరిక సంజీవరెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, పొట్ట శీను తదితరులు పాల్గొన్నారు.