సికిల్ సెల్ ఎనీమియా నిర్ధారణ శిబిరం సద్వినియోగం చేసుకోండి: డాక్టర్ రాందాస్

నవతెలంగాణ – అశ్వారావుపేట

ప్రభుత్వం ఆద్వర్యం, వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణలో నిర్వహించే ఆరోగ్య శిబిరాలను అటవీ ప్రాంతం గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని వినాయకపురం పి.హెచ్.సి వైద్యాధికారి డాక్టర్ రాందాస్ కోరారు. మండలంలోని పాత రెడ్డిగూడెంలో గత రెండు రోజులుగా కొండ రెడ్లు లో సికిల్ సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గిరిజనుల్లో పోషకాహార లోపంతో తరుచు రక్తహీనత ఏర్పడే అవకాశం ఉందని, అందుకోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ముందస్తుగా ఎనీమియా గుర్తించడం ద్వారా త్వరిత గతిన చికిత్స అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ జయశ్రీ ,హెచ్ ఎస్(ఎఫ్) శాంత కుమారి, హెచ్ ఎన్ బూబు నాంచారిలు పాల్గొన్నారు.