ఆదివాసి గిరిజన మహిళలకు ఆర్థిక స్వలంబన కోసం నర్సాపూర్ శ్రీ శక్తి వివో ఆధ్వర్యంలో రైతు వేదిక భవనంలో ఇప్పపువ్వు లడ్డూలు రాగిసంకటి రాగి లడ్డూలు రాగి జావా సజ్జ లడ్డూలు మురుకులు తయారీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామీణ పేద నిర్మూలన సంస్థ సెర్ప్ డి ఆర్ డి ఓ అరుణ్ జ్యోతి హాజరై మాట్లాడారు.
జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ వారి ఆర్థిక సహకారంతో ములుగు జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సమన్వయంతో సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు శిక్షణ కార్యక్రమాన్ని వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. చిరుధాన్యాల ద్వారా ఆహార పదార్థాలు తయారీ కేంద్రాల ద్వారా ఆర్థికంగా ఎదగాలన్నారు. ఏజెన్సీలో దొరికే ఇప్పప్పు, చిరుధాన్యాల తో వివిధ రకాల ఆహార పదార్థాల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని, ఆహార పదార్థాలను తయారు చేసి ఈ ఆహార పదార్థాలను మేడారం జాతరలో స్టాల్ ల్లో విక్రయించడం ద్వారా మహిళలు మహిళ సంఘాలు ఆర్థికంగా బలపడతారని అన్నారు. కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసి అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాల సభ్యులు క్రమ తప్పకుండ పొదుపుతో పాటు వివిధ రంగాలలో శిక్షణ పొంది ఉపాధి పొందాలని తద్వారా కుటుంబానికి మహిళలు ఆర్థికంగా తోడ్పడు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంకిడి నరసింహస్వామి, సిరి ఆర్గనైజేషన్ శ్రీనివాస్, ట్రైనర్ స్వరూప, ఐకెపిసిసి సుజాత, సిసిఎస్, వివోఏఎస్, ఎస్జీహెచ్ఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.