నవ తెలంగాణ – పటాన్చెరు
విద్యార్థుల సృజనాత్మకత, పరిశోధన, విమర్శనాత్మక ఆలో చనా నైపుణ్యాలను ప్రదర్శించేలా ‘పోస్టర్ ఎగ్జిబిషన్’ను బుధవారం గీతం హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ నిర్వహించారు. డిజిటల్ హ్యుమానిటీస్ అంతర్ విభాగ స్వభావాన్ని, సమకాలీన సమాజంలో దాని ఔచిత్యాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శన సాగింది. డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లెఫ్ట్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఏ నాలుగో సెమిస్టర్ విద్యార్థులు తమ పరిశోధనా ప్రాజెక్టులను గోడ పత్రికలుగా రూపొందించి, అందరి ముందు ప్రదర్శించారు.పత్రికలు, డిజిటల్ సమాచారం: సారూప్యం, మార్పు, భవిష్యత్తుబీ ఇన్స్టాగ్రామ్ ద్వారా వ్యక్తి త్వాల ఆవిష్కరణ: డిజిటల్ ప్రపంచంలో పిల్లల పెంపకంబీ క్రీడలు, నిరసనలు, మీడియాబీ కెమెరా వెనుక (భారత చలనచిత్ర పరిశ్రమలో మహిళలు)బీ భవన నమూనాల రూపకల్పన, నిర్మాణాలపై క్షత్రికు మేథ ప్రభావం: ఆర్థిక అసమానత ధోరణలు వంటి సలు సమాకాలీన అంశాలపై విద్యార్థులు పరిశోధించి, పోస్టర్ల రూపంలో వాటిని ప్రదర్శించారు. సాంకేతికత, సమాజం, సంస్కతి విభజనలపై లోతైన విశ్లేషణ చేశారు. ఆయా ప్రాజెక్టులు విమర్శనాత్మక విశ్లేషణ, సజనాత్మకత వ్యక్తీకరణకు వేదికగా మారాయి.జీఎహెచ్ఎస్ డైరెక్టర్ సన్నీ గోస్మాన్ జోస్, పలువురు అధ్యాపకులు, తోటి విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొని, పలు సందేహాల గురించి అడిగి నివత్తి చేసుకున్నారు.