వాస్తవాలను వెలికితీయడంలో నవతెలంగాణ పాత్ర కీలకం

– ఎస్‌వీఎస్‌ ఇన్ఫ్రా డెవలపర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మల్లెంపాటి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-హైదరాబాద్‌
వాస్తవాలను వెలికి తీయడంలో నవ తెలంగాణ పత్రిక కీలక పాత్ర పోషిస్తున్నదని ఎస్‌వీఎస్‌ ఇన్ఫ్రా డెవలపర్స్‌ మేనేజంగ్‌ డైరెక్టర్‌ మల్లెం పాటి వెంకటేశ్వర్ల అన్నారు. బుధవారం బోడుప్పల్‌లోని నవ తెలంగాణ 2024 నూతన క్యాలెండర్‌ను ఉప్పల్‌ డివిజన్‌ ఇన్‌చార్జి చినపంగి గోపితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎండీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నవ శకానికి అనుదినం జనస్వరంగా వాస్తవాలను నిర్భయంగా రాస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ నవతెలంగాణ పత్రిక ముందు కొనసాగు తుందన్నారు. నవ తెలంగాణ పత్రిక అభ్యున్నతి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు.
ప్రజల మనసులను చురగొన్న ఎస్వీఎస్‌ డెవలపర్స్‌
ప్రజలకు నాణ్యమైన ధరలకే ప్లాట్లు విక్రయిస్తూ, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల మనుసులను చురగొంటు ముందుకు వెళ్తున్నామని వెంకటేశ్వర్లు అన్నారు. హైదరాబాద్‌ సిటీకి దగ్గరలోని భువనగిరి, రాయగిరి, యాదగిరి గుట్ట సమీపంలో నూతన వెంచర్లతో ప్రజలకు తక్కువ ధరలకే ప్లాట్లు విక్రయిస్తు ముందుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మల్లెంపాటి వెంకటేశ్వర్లు ఎండీ, మల్లెంపాటి యశ్వంత్‌ ఈడీ, పెడ్డి కుమార్‌ గౌడ్‌, సెల్స్‌ డైరెక్టర్‌, జిల్ల వేణు , ఎస్‌ ఎం.ఎం. కష్ణ గౌడ్‌, రావాల పరమేష్‌, బొంగ రేణేష్‌, తొర్రీ నరేష్‌, భాగస్‌ భాస్కర్‌, రావుపల్లి నగరాజుగౌడ్‌, పెడ్డి హరీష్‌ కుమార్‌ గౌడ్‌, కల్లె రామ్‌ రవిగౌడ్‌, బొంగ సతీష్‌, రేవు కష్ణ తదితరులున్నారు.