– ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి
నవతెలంగాణ – హయత్ నగర్
ట్రాఫిక్ నియంత్రణకు ఆర్టీసీ బస్ డ్రైవర్లు సైతం సహకరించాలని ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్లో ఉన్న బస్ స్టాండ్ వద్ద ఆర్టీసీ సిబ్బందితో కలిసి ట్రాఫిక్ పోలీసులు బుధవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా తమ తమ గమ్య స్థానాలకు చేరేందుకు గాను ఆర్టీసీ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా చేస్తున్న డ్రైవ్లో భాగంగా ఈ పండుగకు ప్రత్యేక బస్సులను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సింగ్ రావు తదితరులు ఉన్నారు.