కేపీహెచ్‌బీ డివిజన్‌ సమస్యలపై కార్పొరేటర్‌ పర్యటన

నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
కేపీహెచ్‌బీ డివిజన్‌లో సమస్యలపై బుధవారం కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు పర్యటించారు. ముందుగా వసంత్‌ నగర్‌, మెడోలండ్స్‌, డైమండ్‌ ఎస్టేట్‌, డ్రీమ్‌ వ్యూ కాలనీలో పర్యటించారు. వసంత నగర్‌లో ప్రధా నంగా హౌటల్స్‌ నుంచి వచ్చే వ్యర్ధాల వల్ల డ్రయినేజీ బ్లాక్‌ అవుతుందని, అలాగే డ్రయినేజీని సరిగా శుభ్రం చేయడం లేదని మందడి శ్రీనివాసరావు దష్టికి ప్రజలు తీసుకొచ్చారు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని, డ్రయినేజీ ఎక్కడా బ్లాక్‌ అవ్వకుండా హౌటల్స్‌ వారికి గట్టి హెచ్చరికలు జారీ చేయాలని అధికారులకు కార్పొరేటర్‌ తెలిపారు అలాగే డ్రయినేజీని ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మెడో ల్యాండ్స్‌లో పర్యటిస్తూ కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం త్వరితగ తిని పూర్తి చేయాలని.. పిల్లలకు, మహిళలకు సంబంధించి పార్కుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రధానంగా పైప్‌లైన్‌ నిర్మాణం వల్ల అక్కడక్కడ రోడ్లు పెండింగ్‌లో ఉండడాన్ని స్థానికులు తెలపగా దీనిపై పనులు జాప్యం జరగకుండా చూడాలని, ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలకుం డా చేయాలని కార్పొరేటర్‌ సూచించారు. వీధి దీపాలు, ఎలక్ట్రిక్‌ పోల్స్‌ కు సంబంధించి ఫిర్యాదులు మేరకు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు మాట్లా డుతూ సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు సహాయ సహకారాలతో ఎక్కడా ఎటువంటి ఇబ్బం దులు లేకుండా ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలు అందించడానికి ఈ పాద యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంకా ఏదైనా ఇబ్బంది ఉన్న ఎడల తమ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఈ సాయి ప్రసాద్‌, హెచ్‌ ఎం డబ్ల్యు ఎస్‌ వెంకటేష్‌ , టి. ఎస్‌. ఎస్‌ .పి .డి సి .ఎల్‌ లింగస్వామి, జీహెచ్‌ఎంసీ డాక్టర్‌ సాల్మన్‌, ఎస్‌ఆర్‌పీ శ్రీనివాస్‌, ఎస్‌ఎఫ్‌ఏ కష్ణ, రాజేష్‌, ఎంటమాలజీ శ్రీనివాస్‌, స్ట్రీట్‌ లైట్‌ పుల్లారావు రాంకీ హరికష్ణ, టౌన్‌ ప్లానింగ్‌ రమేష్‌, రాజేష్‌, పాతురు గోపి ,గోపాల్‌ ,భవాని భారతి, కృష్ణకుమారి ,హేమ, వెంకటరెడ్డి, కాలనీ అసోసియేషన్‌ సభ్యులు అధికారులు పాల్గొన్నారు…