నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ ఎస్ ఐ దేవి సింగ్ సస్పెండ్

ఉత్తర్వులు జారీచేసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ 
నవ తెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాద్ కమిషనరేట్ ఏఆర్ ఎస్సై దేవీ సింగ్ సస్పెండ్ అయ్యారు. విధుల నుంచి తొలగిస్తూ సీపీ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగో టౌన్ పరిధిలో జరిగిన ఓ వివాదానికి సంబంధించి దేవీ సింగ్ ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఎవరు విధుల్లో నిర్లక్ష్యం చేసినా, ఏ చిన్న ఆరోపణ వచ్చినా సీపీ కల్మేశ్వర్ సత్వరమే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బందికి చార్జిమెమోలు ఇచ్చారు.