
మండలంలో పెద్దతూoడ్ల గ్రామంలోని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో ముందస్తుగా సంక్రాంతి పండుగ సంబరాలు నిర్వహించినట్లుగా పాఠశాల కరస్పాండెంట్ వాల శశిధర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా పాటశాలలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి పోటీల్లో గెలుపొందిన విద్యార్థినిలకు బహుమతులు ప్రదానం చేసినట్టుగా తెలిపారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు స్వప్న, రాజకుమారి, తులసి,అస్మ, లావణ్య, దివ్య,రుచిత పాల్గొన్నారు.