సామాజిక సేవలో రోటరీ క్లబ్

– కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం లో పాఠశాల సామాగ్రి అందజేత
నవ తెలంగాణ – భువనగిరి రూరల్ 

రోటరీ క్లబ్  భువనగిరిసెంట్రల్  ఆధ్వర్యంలో గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం, రాంపూర్ తండా  గల  ప్రభుత్వ కస్తూరిబా గాంధీ  బాలిక విద్యాలయం లో డా. తిరునగరి రంగయ్య,  మాజి గవర్నర్, డా ఎంపల్ల బుచ్చిరెడ్డి చైర్మన్, మెంబర్షిప్ ఎక్సేటెన్షన్ జోన్ 2, డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం, హబ్సిగూడ హైదరాబాద్, భువనగిరి, అల్లె నరేష్, సాయి సాయి తేజ ఫర్నిచర్స్ భువనగిరి  సౌజన్యంతో  రూ.18,500 విలువ అహుజా సౌండ్ బాక్స్, రూ. 37500 విలువ గల స్పోర్ట్స్ కిట్స్, రూ.25000 విలువ గల సిమెంట్ బెంచెస్, రూ.4500 విలువ గల పది ప్లాస్టిక్ చైర్స్, రూ. 5500 విలువ గల అల్మారా లను విద్యాలయ ప్రిన్సిపల్ అనిత కి అందజేశారు . ఈ సందర్భంగా డాక్టర్ తిరునగరి రంగయ్య  మాట్లాడుతూ .. సమాజ సేవలో రోటరీ క్లబ్ సేవలు ముందున్నాయని అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొక్కలకొండ నిమ్మయ్య  అసిస్టెంట్ గవర్నర్, పకీరు కొండల్ రెడ్డి అధ్యక్షులు, గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి చైర్మన్, రోటరీ ఫౌండేషన్ జోన్ 2, కోశాధికారి గుమ్ముల మల్లేశం, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.