నవతెలంగాణ-శంకరపట్నం : శంకరపట్నం మండల పరిధిలోని కేశవపట్నం గ్రామానికి చెందిన నాంపల్లి శివాజీ పై గుర్తుతెలియని వ్యక్తి బీరు సీసాతో దాడి చేయడంతో శివాజీ,తలకు, చెంపకు తీవ్ర గాయాలైన ఘటన వివరాల్లోకి వెళితే కేశవపట్నం గ్రామానికి చెందిన నాంపల్లి శివాజీ బుధవారం రాత్రి తన ఇంటి సమీపంలో కూర్చుని ఉండగా గుర్తుతెలియని వ్యక్తి బీరు సీసాతో దాడి చేయడంతో తలకు తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికులు 108కి ఫోన్ చేయడంతో 108 సిబ్బంది ఏంటి సతీష్ రెడ్డి,పైలట్ ఖాజా ఖలీల్ లాల్ ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని ప్రథమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ హాస్పిటల్ తరలించారు.