పదవి ఉన్నా లేకపోయినా ప్రజాసేవకే అంకితం

నవతెలంగాణ-తిరుమలగిరి : తనకు పదవి ఉన్నా లేకపోయినా తాము ఎల్లప్పుడూ ప్రజా సేవలోనే ఉంటామని తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొమ్మినేని స్రవంతి సతీష్ కుమార్ తెలిపారు గురువారం మీడియాతో మాట్లాడుతూ తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా సంవత్సరం పాటు రైతులకు, వ్యాపారులకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందించామని అన్నారు. సంవత్సరం కాలంలో రైతులు వ్యాపారులకు సమన్వయంగా ఉంటూ రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించామని, తాను మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మార్కెట్ కుభారీగా ధాన్యం రావడం మద్దతు ధరను కల్పించడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చేలా చేసినందుకు రైతులు హర్షాన్ని వ్యక్తం చేశారని వారు అన్నారు, రైతాంగం కోసం సంవత్సర కాలంలో వారికి ఎలాంటి లోటు రాకుండా రైతులకు కావలసిన సౌకర్యాలను కల్పించామన్నారు.అలాగే తనను మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియామకం చేసిన మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంతక0డ్ల జగదీశ్వర్ రెడ్డి ,తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే తనకు సహకరించిన మార్కెట్ డైరక్టర్లు కార్యాలయ సిబ్బంది హమాలి. దడ్వాయ్ ,స్వీపర్లు, రైతుల, శ్రేయోభిలాశుల కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు తమకు పదవులు ముఖ్యం కాదనీ ప్రజాసేవలోనే ఉంటామని ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యపై నిరంతరం పోరాటం చేస్తామని చెప్పారు.