నవతెలంగాణ-జక్రాన్ పల్లి : స్కూటీపై నుండి పడి ఒకరు మృతి చెందినట్లు చక్రంపల్లి ఎస్సై తిరుపతి గురువారం తెలిపారు. మండలంలోని మునిపల్లి గ్రామానికి చెందిన గుడ్ల సురేష్ తండ్రి లింగం,, (49 )సంవత్సరాలు ప్రస్తుతం ఆర్మూర్ ఎస్ బి కాలనీ లో నివాసం ఉంటున్నాడు. గురువారం సాయంత్రం 5:50 కి మునిపల్లీ లోని అతని కులస్తుని చావుకు స్కూటీపై వచ్చి తిరిగి ఆర్మూర్ కి వెళుతుండగా మునిపల్లి శివారులోని కోల్డ్ స్టోరేజ్ దగ్గర అదుపుతప్పి తనకు తానుగా స్కూటీపై నుండి కింద పడినాడు తలకు గాయం అవ్వడం వల్ల అక్కడ చనిపోయాడు. మృతుడికి ఇద్దరు భార్యలు ముగ్గురు కొడుకులు, ఉన్నారు. అతని మేనల్లుడు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనైనదని ఎస్సై తిరుపతి తెలిపారు.