ట్రస్మా అర్బన్ నూతన అధ్యక్షుడిగా స్టార్ వరల్డ్ స్కూల్ ధర్మరాజు ఎన్నిక

నవతెలంగాణ-కంటేశ్వర్: స్థానిక ఒక హోటల్ హాలులో జరిగిన ట్రస్మా అర్బన్ సర్వసభ్య సమావేశంలో సంఘం అర్బన్ ఎన్నికలు జరిగాయి. అంతకు ముందు అధ్యక్షులుగా ఉన్న పి. నర్సింహ రావు, కార్యదర్షి కిరణ్ కుమార్ వారి హయాంలో జరిగిన కార్యక్రమ వివరాలను తెలిపగా, కోశాధికారి నాగరాజు ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ లెక్కలు తెలిపారు.  తర్వాత రాష్ర్ట సంఘ బలోపేతానికి కృషి చేసి రాష్ట్ర ట్రస్మా స్పోక్స్ పర్సన్ గా ఎన్నికైన జయసింహ గౌడ్ ని సభ్యులు ఘనంగా సన్మానించారు. తదుపరి ఎన్నికల నిర్వహణ జరిగింది.ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా రాష్ట్ర సలహాదారుగా ఉన్న మామిడాల మోహన్ వ్యవహరించారు. పరిశీలకులుగా జిల్లా అధ్యక్షుడు జయసింహ గౌడ్, కార్యదర్శి జనార్ధన్, కోశాధికారి నిత్యానంద విచ్చేశారు. ఈ ఎన్నికలలో అధ్యక్ష స్థానానికి కే. ధర్మరాజు, అనుముల క్రాంతి పోటిపడగా, జరిగిన ఓటింగ్ లో ధర్మరాజు ఆధిక్యతను పొంది అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా కే. శ్రీనివాస్, కోశాధికారిగా నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మిగతా కార్యవర్గాన్ని అతి త్వరలో ఏర్పాటు చేస్తామని జిల్లా అధ్యక్షుడు జయసింహ ప్రకటించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గం చే ఎన్నికల అధికారిగా వ్యవహరించిన మామిడాల మోహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.