
నవతెలంగాణ-బొమ్మలరామారం : ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి దరఖాస్తులు ఆన్ లైన్ ప్రక్రియను సకాలంలో పూర్తయ్యేలా చూడాలిని యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ సీఈఓ సిహెచ్. కృష్ణారెడ్డి అన్నారు.గురువారం స్థానిక ఎంపీడీవో, తాసిల్దార్ కార్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు.అనంతరం వివరాలు తెలుసుకున్నారు మొత్తం 12334 దరఖాస్తులు వచ్చినట్టు ఇప్పటివరకు 9464 వరకు దరఖాస్తులు కంప్యూటరీకరణను చేసినట్టు చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజా పాలన దరఖాస్తులు చేస్తున్న క్రమంలో ఎలాంటి అవకతవకులు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీ నివాస్ రావు,స్పెషల్ ఆఫీసర్ జ్యోతి కుమార్, ఎంపిడివో సరిత, తదితరులు ఉన్నారు.