నవతెలంగాణ కమ్మర్ పల్లి: మండల కేంద్రంలోని మిసిమి ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. పలువురు విద్యార్థులు అందమైన ముగ్గులు వేసే అలరించారు. ఈ ముగ్గుల పోటీలలో మొదటి బహుమతి తన్వీశ్రీ, ద్వితీయ బహుమతి కీర్తన, తృతీయ బహుమతి కుషిక గెలుచుకున్నారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఉపాధ్యాయినీలు లక్ష్మి, రాజశ్రీ, శ్రీలక్మి వ్యవహరించారు.
కృష్ణవేణి పాఠశాలలో…..
మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగ సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాలలో ఉదయం విద్యార్థిని విద్యార్థులు గాలిపటాలు ఎగురవేసి ఆనందంతో కేరింతలు వేశారు.అనంతరం విద్యార్థినిలు మహిళా ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణంలో పలు రకాల రంగులతో రంగోలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేశారు.సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అని అంటారని గుర్తు చేశారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను ఘనంగా వైభవంగా జరుపుకుంటారని తెలిపారు.సంక్రాంతి పండుగను భోగి, సంక్రాంతి, కనుమగా మూడు రోజుల్లో జరుపుకుంటారని అన్నారు.మొదటిరోజు భోగిమంటలతో, రెండవ రోజు పొంగలి పిండి వంటలతో, పితృదేవతల, దేవుళ్ళ పూజలతో, మూడవరోజు గో పూజలతో ఎంతో ఆనందంగా జరుపుకుంటారని తెలిపారు.భోగి పండుగ నాడు పాత వస్తువులను దహనం చేయడం జరుగుతుంది.అలాగే విద్యార్థులు కూడా గత సంవత్సరంలో జరిగినటువంటి మంచి చెడులను పక్కనపెట్టి ఈ సంవత్సరం మంచి ఆలోచనతో క్రమశిక్షణతో చదువులో ముందుండాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చిలుక గంగా ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ కుందారం సచిన్ ఉపాధ్యాయులు కమల్, స్రవంతి, మనోజ్ఞ, రమ్య, తబసుమ్, స్వప్న, రూప శ్రీ, షాహిన్, నిఖిత తదితరులు పాల్గొన్నారు.