నవతెలంగాణ-పెన్ పహాడ్ : మండల పరిధిలోని దోసపహడ్ మూసి నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న అక్కలదేవిగూడెం గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లు, సీతమ్మ తండాకు చెందిన ఒక ట్రాక్టర్ ను గురువారం పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్సై నర్సింగ్ వెంకన్న గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా ఇసుక రవాణా చేస్తే వాల్టా చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాక్టర్ డ్రైవర్లు కూడా డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ట్రాక్టర్ కు సంబంధించిన అన్ని పత్రాలు కలిగి ఉండాలని వాటితో పాటుగా మండల తహసీల్దార్ అనుమతి పత్రం కూడా ఉండాలన్నారు. అన్ని అనుమతులు ఉన్నవారు అతివేగంగా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.