నవతెలంగాణ చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ లైన్స్ క్లబ్ పాలకవర్గ సభ్యులు నల్లగొండ జిల్లా గట్టుపల్ మండల కేంద్రానికి చెందిన కర్నాటి రవి కర్నాటి ధనుంజయ ఇద్దరూ దివ్యాంగులు.వారితోపాటు బాబాయ్ కర్నాటి హనుమంతు కూడ పుట్టి గుడ్డి బాధపడుతున్నారని విషయం తెలుసుకొని చౌటుప్పల్ లైన్స్ క్లబ్ చైర్మన్ దాచేపల్లి ప్రకాష్ గుప్తా గురువారం గట్టుపల్ గ్రామానికి వెళ్లి పదివేల ఆర్థిక సాయంతో పాటు నిత్యవసర సరుకులు అందించారు. కర్నాటి రవి, ధనుంజయ ఆలన పాలన మొత్తం వాళ్ళ తల్లి చేసుకుంటుంది. తల్లికి వైశరీత్యా చేతకాక పోవడంతో ఇట్టి విషయాన్ని తెలుసుకున్న చౌటుప్పల్ లైన్స్ క్లబ్ పాలకవర్గ సభ్యులు ఆర్థిక సాయాన్ని నిత్యవసరకులని అందించారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ అధ్యక్షులు దాచేపల్లి ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ ఆ కుటుంబ సభ్యులను చూసి బాధేసిందని అన్నారు. భవిష్యత్తులో లైన్స్ క్లబ్ చౌటుప్పల్ తరపున వారిని ఆదుకుంటామని భరోసానించారు. ఈ కార్యక్రమంలో తిరందాసు జగన్నాథ్ ఉపాధ్యక్షులు అత్తర్ పాషా డిసి సభ్యులు గోశీక కరుణాకర్, నాంపల్లి రమేష్, కాసుల వెంకటేశం, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, కామిశెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.