నవతెలంగాణ కమ్మర్ పల్లి: మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్థినీలు దివ్య, సుమలత రాష్ట్ర స్థాయి జూనియర్ గర్ల్స్ హ్యాండ్ బాల్ పోటీకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న గురువారం తెలిపారు. రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీకు ఎంపికైన విద్యార్థినిలు ఈ నెల 15,16,17తేదీలలో ఆసిఫాబాద్ లో జరిగే హాండ్ బాల్ ట్రోఫీలో పాల్గొంటారని పాఠశాల పీఈటీ మాధురీ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులూ రాజన్న, ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయి జూనియర్ గర్ల్స్ హ్యాండ్ బాల్ పోటీకు ఎంపికైన విద్యార్థినిలు దివ్య, సుమలత, పీఈటీ మాధురి లను అభినందించారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని పాఠశాలకు గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.