రుద్రారంలో ముగ్గుల పోటీలు

నవ తెలంగాణ  – మల్హర్ రావు
సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని, తెలంగాణ ఐటి,పరిశ్రమ,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు ఆశీస్సులతో మండలంలోని రుద్రారం గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు భోగే మల్లయ్య ఆధ్వర్యంలో బాలికలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు,బాలికలు వేసిన రంగురంగుల ముగ్గులు పలువురిని అలరించారు. పోటీల్లో గెలుపొందిన ప్రథమ ఎస్ సుప్రియ, ద్వితీయ నవ్య, తృతీయ బి.శిరీశా లకు చీరలు,ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారికి ప్లేట్స్ బహుమతులు అందజేసినట్లుగా నిర్వాహకులు మల్లయ్య తెలిపారు.