సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

నవతెలంగాణ- వలిగొండ రూరల్
 మండలంలోని టేకులసోమారంలో అప్పటి భువనగిరి పార్లమెంట్ సభ్యులు  ప్రస్తుత రాష్ట్ర రోడ్లు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంజూరు చేసిన 15 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ  రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ప్రముఖ పారిశ్రామిక వేత్త చేగురి మల్లేశం ఏర్పాటుచేసిన నూతన సంవత్సర క్యాలండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చేగురి బిక్షపతి, అజ్మా లన్ బాబా బాబా, ఎంపిటిసి కార్యకర్తలు, మల్లేశం యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.