రక్తదానం మహా గొప్పది..

– రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు 
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని యెల్లరెడ్డి పల్లి గ్రామంలో స్వామీ వివేకానంద జయంతి సందర్భంగా రక్త దాన శిబిరాన్ని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ, యువజన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. యువకులు భారీ ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు.ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఆంజనేయులు, సామాజిక కార్యకర్త పులి సాగర్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఆ సమయంలో ఒక రక్తం చుక్క కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటదని అన్ని దానాల కంటే రక్తదానం మహా గొప్పదని వారన్నారు యువకులు స్వామి వివేకానంద చూపిన మార్గంలో నడవాలని వారు అన్నారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని రక్తదానం చేయడానికి ముందుకొచ్చిన యువకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జీ నరేష్, ఎంపిటిసి బాబురావు,ఉప సర్పంచ్ జి శ్రీనివాస్, యువజన సంఘాల సభ్యులు, శ్రావణ్, లక్ష్మణ్, రఘు తో పాటు యువకులు తదితరులు పాల్గొన్నారు.