బాలవికాస సేవలు మరువలేనివి: మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత 

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలను బాలవికాస సంస్థ సేవా కార్యక్రమాలతో పాటు అండగా నిలిచి తోడు ఉండటం చాలా గొప్పతనం అని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత అన్నారు. శుక్రవారం  హుస్నాబాద్ లో  అనాధ పిల్లలకు సామూహిక జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనాధ పిల్లలను సమాజంలో ప్రతి ఒక్కరు చేరదీసి అక్కున చేర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యుడు కేడం లింగమూర్తి  తదితరులు పాల్గొన్నారు.