సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా.. జాగ్రత్తలు పాటించండి

– అబిడ్స్‌ ఇన్‌ స్పెక్టర్‌ టి.నరసింహారాజు
నవతెలంగాణ-సుల్తాన్‌ బజార్‌
సంక్రాంతి సెలవుల్లో పండక్కి ఊరు వెళ్తున్న వారు జాగ్రత్తలు పాటించాలని అబిడ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ టి. నరసింహా రాజు అన్నారు. శుక్రవారం అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లోని ఆయన చాంబర్‌లో మాట్లాడు తూ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులను బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాల ని సూచించారు. సెలవుల్లో బయటికి వెళ్తున్నప్పుడు సెక్యూరి టీ అలారం ఏర్పాటు చేసుకోవాలని, ఇంటికి సెంట్రల్‌ లాక్‌ సిస్టమ్‌ ఉండే తాళం అమర్చుకోవడం మంచిదన్నారు. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఇంట్లో లైట్‌ వేసి ఉంచుకోవాలని సూచించారు. కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీస్‌ స్టేషన్‌ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. తప్పనిసరిగా డయల్‌ 100కు కాల్‌ చేయాలని తెలిపారు. వాహనాల ను ఇంటి ఆవరణలోనే పార్క్‌ చేసుకోవాలని, నమ్మకమైన వారిని మాత్రమే వాచ్‌మెన్‌, సెక్యూ రిటీ గార్డ్‌ నియమించుకోవా లన్నారు. ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్‌లైన్‌లో ఫోన్‌లో ఎప్పటిక ప్పుడు చూసుకుంటూఉండాలని తెలి పారు. అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.