పీఏసీఎస్ చైర్మన్ సస్పెండ్

 నవ తెలంగాణ – నూతనకల్
పీఏసీఎస్ ఛైర్మన్ కే.వెంకటేశ్వర్లు అలియాస్  కే.వెంకన్న అవినీతి అక్రమాలకు పాల్పడినందున ఛైర్మన్ పదవి నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కోఆపరేట్ అధికారి శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసిఒ కార్యాలయం నుండి అనేక పర్యాయాలు నోటీసులు జారీ చేసినా, సక్రమమైనటువంటి సమాధానాలు చెప్పనందువలన అవినీతికి పాల్పడిన, రూ.5 లక్షల రూపాయలను 18% శాతం వడ్డీతోపాటు కట్టాల్సి ఉండగా, మొత్తం రూపాయలు 7 లక్షల 75 వేల రూపాయలు కట్టనందువలన చైర్మన్ పదవి నుండి తొలగించడం జరిగినదని పేర్కొన్నారు.  తేది12/01/2024 నుండి వైస్ చైర్మన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి ఛైర్మన్ గా భాధ్యతలు స్వీకరించమని సూచించారు
.