
తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో వెలిసిన 2024 క్యాలండరును శనివారం జిల్లా ఇంటర్ మీడియట్ అధికారి రఘు రాజ్ చేతులమీదుగా అధ్యాపకుల బృందం నూతన సంవత్సర క్యాలెండరును జిల్లా కేంద్రములోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈసందర్బంగా విద్యార్థుల వార్షిక పరీక్షలకు సంసిద్దులను చేయవలసిన బాధ్యత అధ్యాపకులపై ఎంతైనా ఉందని సూచించారు. కొత్తగా క్రమబద్దీకరణ అయిన ఆధాపకులు కళాశాల పట్ల అలాగే విద్యార్థుల పట్ల చూపుతున్న శ్రద్ద,ప్రతి సంవత్సరం ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి ,గ్రామా గ్రామాన ప్రభుత్వ కళాశాలలోని చదువుపై విద్యార్థులతోపాటు వారి తల్లితండ్రులకు అవగాహన కల్పిస్తూ అధిక సంఖ్యలో విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలో విద్యాభ్యసించే విధంగా కృషి చేస్తున్న విధానం హర్షించదగ్గ విషయమని అన్నారు, అలాగే కళాశాలలో మౌలిక సదుపాయాల్లో వారు చేస్తున్న ఆర్థిక సహాయాన్ని గుర్తిస్తూ ప్రసంశించారు. ఎల్లప్పుడూ విద్య బోధన పట్ల,కళాశాల మౌలిక వసతుల పరిష్కార దిశగా ఇలాగె కొనసాగించాలని ఆకాక్షించారు. ప్రతి సంవత్సరంలాగా ఈసంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని సూచించారు. కార్యక్రమములో జిల్లా ఇంటర్ మీడియట్ అధ్యాపకుల సంఘం అధ్యకుడు మామిడి విట్టల్,ఉపాధ్యక్షుడు రాము, జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిసెల శ్రీనివాస్,జోహాన్,సాయి ప్రసాద్,జిల్లాలోని ఆయా మండలాల్లోని అధ్యాపక బృందం పాల్గొన్నారు.