ఉష:కాల హిమబిందువులు
పుడమికి ముత్యాలు అద్దగా
మకరరాశి నెరజాణ
భానుడ్ని ఆహ్వానిస్తుండగా
ఎద ఎదనూ మురిపించే
సంతోషాల తోరణాలతో
సంబరాల తేరువుపై విచ్చేస్తున్న
సంక్రాంతి లక్ష్మి కోసం
తిరునాళ్ళ శోభ సంతరించుకొన్న
పల్లె అందాలు ఆస్వాదింప,
జీవన పోరాటంలో కాంక్రీటు వనాలు చేరిన
పల్లె వలస పక్షులు
ఉరుకుల పరుగుల జీవనానికి దూరంగా
కాలుష్య కౌగిలి విదుల్చుకొని
సౌధాల అడవులు విడిచి
విచ్చేస్తున్నారు! వచ్చేస్తున్నారు!
అమ్మగూటికి.
బిడ్డల రాకకోసం కళ్ళు చేటంతలు చేసిన పల్లెతల్లికి
నిజంగా సంక్రాంతి పండగే!
– వేమూరి శ్రీనివాస్, 9912128967