– అలవెన్సులపై 25 శాతం పెంపు
– ప్రభుత్వరంగ సంస్థల్లో 19 సంవత్సరాల వేజ్‌బోర్డు
– అలవెన్స్‌లపై ఇన్‌కమ్ ట్యాక్స్ సంస్థనే చెల్లించాలి
నవతెలంగాణ-జైపూర్
11వ వేజ్‌బోర్డు ద్వార సింగరేణి కార్మికులకు 19 శాతం మినిమం బెన్ఫిట్‌తో అలవెన్సులపై 25 శాతం అదనంగా పెంచుకోవడం జరిగిందని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్‌కే బాజీసైదా తెలిపారు. ఇందారం-1ఏ గని పిట్ కార్యదర్శి నవీన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం గని ఆవరణలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో ఆయన కార్మికులను ఉద్దేషించి మాట్లాడారు. 11వ వేజ్‌బోర్డు ఒప్పందం ద్వార జూనియర్ కార్మికులకు సుమారుగా నెల ఒకటికి రూ.10 వేలు, సీనియర్ కార్మికులకు నెల ఒకంటికి రూ. 20 వేల లబ్ధి చేకూరుతుందని అన్నారు. కాగా ప్రభుత్వ రంగ సంస్థల్లో 10 సంవత్సరాల వేజ్‌బోర్డు ఉన్నప్పటికీ కోలిండియాలో మాత్రం ఐదు సంవత్సరాల బేజ్‌బోర్డుతో 19 శాతం మినిమం బెన్ఫిట్ సాధించడంలో వేజ్‌బోర్డు సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య కృషి ఎంతగానో ఉన్నదని తెలిపారు. వేజ్‌బోర్డు సమావేశంలో కుదిరిన ఒప్పందం ప్రభుత్వ ఆమోదం పొంది ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో కార్మికులకు పెంచుకున్న జీతభత్యాలు అందుతాయని తెలిపారు. కాగా కోలిండియాలో కార్మికులకు, సింగరేణిలో అధికారులకు మాత్రమే అలవెన్సులపై ఇన్‌కమ్ టాక్స్ యాజమాన్యం చెల్లిస్తుండగా సింగరేణి కార్మికులకు కూడా అలవెన్సులపై ఇన్‌కమ్ టాక్స్ యాజమాన్యం చెల్లించాలని ఈ సంధర్భంగా డిమాండ్ చేశారు. ఈ విషయమంలో గుర్తింపు సంఘంగా ఎన్నికైన టీబీజీకేఎస్ కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చులేకపోయిందని, వేజ్‌బోర్డులో తలుపులు తన్నుకొని వెల్లి సాధించి తీరుతామని చెప్పి కార్మికులను మోసం చేశారని తెలిపారు. ఈ విషయంలో టీబీజీకేఎస్ నాయకులు సింగరేణి కార్మికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్మికుల శ్రేయస్సు కోరి పని చేస్తూ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న కార్మిక సంఘాన్ని గుర్తించి ఆదరించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలుపులో కార్మికులు భాగస్వామ్యం కావాలని ఈ సంధర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర కమిటి కార్యదర్శి సమ్మయ్య, శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ సహాయ కార్యదర్శి నర్సింగరావు, నాగభూషణం, జుట్టు రాములు, ఎక్బాల్ హుసేన్, శంకరయ్య, సూర్య, కుమారస్వామి, విజరు మైపాల్ పాల్గొన్నారు.