– ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
నవతెలంగాణ-నేరేడ్‌మెట్
ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన, అల్వాల్ కార్పొరేటర్ విజయ శాంతితో కలిసి నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలన్నారు. అల్వాల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చూడాల్సిన బాధ్యత వైద్య విభాగం పై ఉన్నదని ఆయన తెలియజేశారు. చుట్టూ ప్రహరీ గోడ టైల్స్ కూడా అమర్చాలని ఆయన కాంట్రాక్టర్లకు సూచించారు. లోటు బడ్జెట్‌తో చేయలేనని సర్కారు బాధ్యత వహించాలని కాంట్రాక్టర్ ఎమ్మెల్యేకు విన్నవించారు. ముందుగా అనుకున్న అంగీకార పత్రం ప్రకారం పని చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ ఓ డాక్టర్ రఘునాథ స్వామి, జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్ డాక్టర్ రామ్ కుమార్, స్థానిక ఆస్పత్రి డాక్టర్ ప్రసన్న కుమారి, సిహెచ్ ఓ రాము, వీరయ్య, జంగయ్య, అరుణ మరియా, కాంట్రాక్టర్ శ్రీనివాసరావు స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు డోలి రమేష్, మల్లేష్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.