
మండలంలోని వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీ గోదా రంగనాధస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నూతి రమేష్ దంపతులు, జెడ్పిటిసి వాకిటి పద్మా అనంత రెడ్డి దంపతులు, ఎంపిటిసి సామ రాం రెడ్డి దంపతులు, భువనగిరి ఆర్డీఓ అమరేందర్ దంపతులు, రామలింగారెడ్డి దంపతులు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి మోహన బాబు, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.దంపతులు