మృతుని కుటుంబానికి పరామర్శ 

నవతెలంగాణ – బెజ్జంకి

మండల పరిధిలోని పెరకబండ గ్రామానికి చెందిన కర్రావుల మల్లయ్య ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందాడు. అదివారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మృతుని చిత్ర పటానికి పూలతో నివాళులర్పించారు. మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి,రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,యువజన మండలాధ్యక్షుడు మంకాల ప్రవీన్,కిసాన్ సెల్ జిల్లా నాయకులు చిలువేరు శ్రీనివాస్ రెడ్డి,టౌన్ అధ్యక్షుడు బండిపెల్లి రాజు,గ్రామస్తులు వడ్లూరీ పర్శరాం పరామర్శలో పాల్గొన్నారు.