రెంజల్ మండలం ధూపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అనాధలకు 21 000 రూపాయలను వివిధ వాట్సాప్, గూగుల్ పే ద్వారా సేకరించిన డబ్బులను ఈ అనాధలకు మేము మీ సేవ సంస్థ అధినేత లక్ష్మయ్య ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఆదివారం మేము మీ సేవ సంస్థ నిర్వాహకుల ద్వారా అనాధలు అయిన హారిక లక్ష్మణులకు ఇట్టి నగదును అందజేయడం జరిగిందని వారు పేర్కొన్నారు . చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అనాధలను ఆదుకోవాలని తలంపుతో సమస్త వివిధ రకాలుగా నగదును సేకరించి వారికి ఆర్థికంగా బలోపేతం చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఫోన్ పే ద్వారా తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేము మీ సేవా సంస్థ నిర్వాహకులు మహేష్, గంగాధర్, సాయిలు, సంతోష్, అభిలాష్ ,రవి ,భూమేష్, రఘుపతి, దేవదాస్, గంగపుత్ర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.