మేడారంలో “చలో మేడారం” ఫోక్స్ సాంగ్ పాటల చిత్రీకరణ

నవతెలంగాణ -తాడ్వాయి
మేడారంలో వన దేవతల సన్నిధిలో ఎస్ ఎస్ ఫోక్స్ హంగామా న్యూస్ ఛానల్ ద్వారా గత రెండు రోజుల నుండి పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో డైరెక్షన్ ప్రొడ్యూసర్ డాక్టర్ కంత్తి సంపత్, రఘు జాన్ లు నటి నటులు నిహల్ గంగావత్- టోనీ కిక్ ల ద్వారా ఫోక్ సాంగును చిత్రీకరించారు. వనదేవతల గద్దెల ఆవరణలో జంపన్న వాగులో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎడ్లబండ్ల ద్వారా ఆదివాసి నృత్యాలతో చిత్రీకరించారు. మేడారం లో అందరిని ఆకట్టుకున్నాయి. చలో మేడారం ఫోక్ సాంగ్ ఆదివాసి సంస్కృతులకు అద్దం పట్టే విధంగా చిత్రీకరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ పరిశోధకులు డాక్టర్ కత్తి మల్లయ్య మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా ఎదిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఎస్ ఎస్ టి బి సి మైనార్టీ కళాకారులకు ప్రత్యేక ప్రోత్సకాలనుంచి కలను అంతరించిపోకుండా రాబోవు తరాలకు అందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ‌ కలలు కనుమరుగు చేయకుండా ఆదుకోవాలని కన్నీరుమున్నీరు తో ప్రభుత్వానికి వ్యక్తం చేశారు.