జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ నాయకుల మధ్య విభేదాలు

– పార్టీ మారి వచ్చిన బీఆర్‌ఎస్‌
– నాయకులతో కలిసి అజారుద్దీన్‌
– పతంగులు పంపిణీ
నవతెలంగాణ- జూబ్లీహిల్స్‌
జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయిన అజారుద్దీన్‌కు 30 సంవత్సరా లుగా కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకున్న సీనియర్‌ నాయకులు, కార్య కర్తలు గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేశారని, అయినా కూడా ఓడిపోయారని సీనియర్‌ కాంగెస్‌ జ్ఞానే శ్వర్‌, శివ, నాగరాజు, యాదగిరి, మేఘన పద్మ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌పీఆర్‌ హిల్స్‌ రెండు బొమ్మల వద్ద ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు మాట్లా డారు. బీఆర్‌ఎస్‌ నుం ఎలక్షన్‌ ముందు కాంగ్రెస్‌ పార్టీ లోనికి రహమత్‌నగర్‌ కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి కొంతమంది తన అనుచరులతో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అనం తరం పార్టీ మారిన అనంతరం వారి అత్యు త్సాహం వలన జూబ్లీహిల్స్‌లో నూరు శాతం గెలుస్తాడు అనుకున్న అజాహ రుద్దీన్‌ ఓడిపోయినట్లు తెలి పారు. అజా రుద్దీన్‌ స్థానికుడు కాదని, ఆయనకు కాంగ్రెస్‌ నాయ కుల పై పూర్తి అవగా హన లేక, ఆయన బలహీ నతలను ఇటీ వల కాంగ్రెస్‌లోకి వచ్చిన వారు ఆసరాగా చేసుకొని స్థానికంగా ఉన్న కాంగ్రె స్‌ నాయకులను దూరం చేస్తున్నారని ఆవేదన వెలి బుచ్చారు. సంక్రాంతి సందర్భంగా రహమత్‌ నగర్‌ డివిజన్‌ ప్రతి భానగర్‌ పీజేఆర్‌ గుడి వద్ద స్థానిక కాంగ్రెస్‌ నాయకులు లేకుండా, కేవలం బీఆర్‌ఎస్‌ పార్టీ నుండి కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చిన వారితో కలిసి అజా రుద్దీన్‌ పతంగులను పంపిణీ చేసినట్లు తెలిపారు. పలువురు సీనియర్‌ మన స్థాపానికి గురై తమ ఆవేదనను వెలిబుచ్చినట్లు తెలిపారు. అజారుద్దీన్‌ ఎందుకు మమ్మల్ని దూరం పెట్టాడో అర్థం కావట్లేదన్నారు. ఇది మాకు చాలా అవమానకరంగా ఉందని, ఈ బాధను మీడి యా సము ఖంగా ప్రజలకు నాయ కులకు తెలియజేస్తు న్నామన్నారు. పీజేఆర్‌కు కంచుకోట అయిన రహమత్‌ నగర్‌ డివిజన్‌లో కాంగ్రెస్‌ పార్టీని బల పరచాలంటే మరొ కసారి అజారుద్దీన్‌ ఈ విధమైన సమా వేశాలు పెట్ట కూడదని అందర్నీ కలు పుకొని పోవాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.